|
నీవు కొవ్వొత్తిని వెలిగించుదువు |
కీ.శే. యన్. దానియేలు గారు |
కీర్తనలు 18:28
నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా జేయును'' మనుష్యుని ఆత్మ దేవుని యొక్క దీపము, కానీ ఇది కాలకపోయినట్లయితే మానవుని ఆంతర్యము అంతా చీకటే. దేవుని ఆత్మ మనుష్యుని ఆత్మలో ఉన్నటు వంటి దీపమును తెలిగించును. ఇది క్రీస్తు యొక్క సిలువ ద్వారా సాధ్యపరచబడుతుంది. నీతిమంతుని వెలుతురు దినములు గడిచే కొలది అంతకంతకు ప్రకాశించును. మానవుని ఆత్మ వెలిగింపబడి ఆ మంట అంతకంతకూ కాంతివంతముగా కాలుచుండగా దేవుడు తన శక్తిని అతని లోనికి పెట్టును. మానవుడు తనలో ఉన్నటువంటి ప్రతి అణువు శుద్ధీకరించబడి, కడుగబడి అగ్నిచేత కాల్చబడుతుంది అని అతడు తెలుసుకున్న తర్వాత తన వ్యక్తిత్వములోని ఏ భాగమును దేవునికి తగినదికాదని ఒప్పుకొనగా అప్పుడు దేవుని మీద పూర్తి భారం వేస్తాడు. మనలో ఒక భాగము నిజముగా మంచిదని మనం ఆలోచించడానికి ప్రారంభిస్తాము. అప్పుడు సైతాను మనలను మోసపరచడానికి ఒక తరుణం దొరుకుతుంది.
కాని దేవుడు మనయందు ఆశపడియున్నాడు. మనము శుద్దీకరించబడే కొలది దేవుని ప్రేమచేత మనం నింపబడతాం. దానిని బట్టి మనమాటలకు గొప్ప శక్తి ఇవ్వబడుతుంది. మానవుని మార్చడానికి తగిన గురిపెట్టకుంటాడు. నీయందుండే దేవుని వాక్యము విశ్వాసమనే గుప్పెట్లో పట్టుకొనియుండగా నీయందు శక్తి ఉంటుంది. దేవుని వాక్యము నెరుగుటయే శక్తి. నీవు దేవుని జ్ఞానముతో నింపుకొని యున్నప్పుడు సాతాను నిన్ను మోసం చేయడు. ఒక ఆలయములో ఉన్నటువంటి సభ్యులందరు దేవుని వాక్యమును వినేవారయితే ఆ సంఘం శక్తివంతముగా ఉంటుంది. ఒక గృహములోని సభ్యులు చాలా మంది దేవుని వాక్యమునందు విశ్వసించినట్లయితే ఆ గృహము చాలా శక్తివంతమయిన గృహము అవుతుంది. నీవు దేవుని వాక్యము చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడడానిక,ి హెచ్చరించడానికి ఒక అవకాశము కొరకు ఎదురుచూస్తున్నాడు. నీ ప్రధామైన పూచీ ఏమనగా మీరు దేవుని వాక్యమును కాపాడుకోవాలి. నీవు దేవుని వాక్యము యొక్క శక్తి క్రిందికి ఏ మాత్రము వచ్చినావు?
నీవు రక్షించబడినప్పుడు నీవు పరిపూర్ణుడవు కాదని చెప్పుతుంది. నీవు పరిపూర్ణుడవుగా చేయబడడానికి రక్షించబడ్డావు నీవు విశ్వాసము ద్వారా శుద్దీకరించబడి లోకము నుండి విడుదల పొందుతున్నావు. క్రీస్తు ప్రభువుకు తనకు వచ్చిన శోధనలకు సరి అయిన సమాధానము సిద్దముగా ఉంది. మన వ్యక్తిత్వము దేవుడు ఎంతగా సిద్ధపరిచినాడు అంటే సమస్తమైన శోధనలకు సమాధానము చెప్పుటకు సిద్దపరిచాడు. ఈ రీతిగా మనము నిర్భయులముగా ఉండగలము. దేవుడు మనతో చాలా సాధువుగా ఉంటాడు. మనబలహీనతను ప్రతి మెట్టులో ఆయన ఎరుగును. ఒక తండ్రివలె మనలను కనికరించును.
దేవుని దగ్గర విమోచన చాలా ఉన్నది. అయితే నీవు ఎందుకు తప్పిపోవుచున్నావు? అది ఎందుకంటే నీవు తగినంతగా ప్రార్థనచేయడము లేదు. అనేక గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థంచేటప్పుడు దేవుడు మనలను నడిపించుటకు ఒక తరుణం దొరుకుతుంది. సాతాను ఒకప్పుడు నా యెడల ఒక దయగల తలంపు తలంచినాడుకాని అది తప్పుడు తలంపు. అప్పటికే ఆరునెలలు ఆ తలంపు ఉంచుకొంటిని. అది దాని వెళ్ళులోతుగా పారనిస్తుంది. దీర్ఘ కాలం నేను దేవునితో గడపవలెనని ప్రయత్నంచేసినాను. దేవుడు ఆ తరుణమును వినియోగించుకొని అది తప్పుడు తలంపు దానిని నాలో నుంచి తీసి వేయాలి అని తెలియ పర్చాడు. మన వెలుగును అభివృద్ధిపరచి దాన్ని పరిపూర్ణము చేయ శక్తి గల దేవుడు.
|
|