లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నా ఎదుట నడుచుచూ పరిపూర్ణుడవుగా ఉండు

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఆదికా. 17:1 ''నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవైయుండు.''

నేను మీకు అభ్యాస సంబంధమైన పాఠములు నేర్పించుచున్నాను. నాతో అనేకమంది ప్రారంభించారు కానీ దేవుడు నాకు ఒక్కటి నేర్పించాడు. యోహాను 16:13 ''ఎలాగైననూ... రమ్ము'' పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు. నీవు తిరిగి పుట్టినప్పుడు, మనము పరిశుద్ధాత్మ దగ్గరనుండి నేర్చుకొనకపోతే మనం ఎదగము. మనము వెంబడించి ఒకర్నొకరము అనుసరించినడుచుకుంటాము. మన సువార్తికులలో ఒకడు నన్ను అనుకరించాలనుకున్నాడు. నేను అతనికి చెప్పాను. ''నేను నిన్ను నడిపించేవాడిని కాదు. పరిశుద్ధాత్మే మీ నాయకుడు.'' నన్ను దేవుని వలే మనుష్యులు చూసినప్పుడు నేను విచారపడతాను. నా సేవకుడు నాకు భయపడితే నేను విచారపడతాను. వారు దేవునికి భయపడి ఆయన చిత్తము వెదికితే శ్రేష్టము. అప్పుడు చిట్ట చివరగా నన్ను తృప్తిపరుస్తారు, ''ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించకపోతే మనం దారి తప్పిపోతాము. నేను వారు తప్పి పోయినప్పుడు ఆయనతో పోరాడి ప్రార్థనలో కారణము కొరకు ఆయనను అడిగేవాడిని. ఒకసారి దేవుడు నాతో చెప్పాడు.'' నీవు దేవుని చిత్తము సరిగా కనుగొన్నావు, కానీ నీ చిత్తమును నా చిత్తముతో కలిపావు. అందుకొరకే నీవు తప్పిపోయావు. తిరిగి, తిరిగి దేవుడు ఎన్నడూ తప్పు చేయడని తెలుసుకున్నాను. ఆదికాం. 17:1 దేవుడు అబ్రహామును నడిపించుచూ ఉండినాడు. ఆయన వాగ్దానములను నాకు అనుగ్రహించాడు. కానీ అబ్రహాము అయితే కొంత కాలం వాటి మీద నిద్రబోతూ ఉండినాడు. మన సహవాసపు సభ్యులు చాలా మంది ప్రార్థన చేస్తూ, చేస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్త ప్రకారం కాదు. అబ్రహాము కొన్నిసార్లు దేవుని చిత్తమును వెంబడించలేదు. ఆయన కుమారుని కొరకు కనిపెట్టుకొని ఉండినాడు. ఆ కుమారుడు ఎప్పుడు కనబడతాడు? దేవుని ఆజ్ఞలను ఆయన వెంబడించినప్పుడు! నీవు దేవుని ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు నీవు గొప్ప శక్తిమంతుడవు, ఆయన వాక్కు నీవు విని వణికితే లోకము నిన్ను చూసి వణకును. యెషయా 66:2 దేవుని వాక్యము అంటే నీవు వణకుతున్నావా? సాధారణముగా మనకు తిరుగు బాటు స్వభావం ఉంటుంది. అది నా జీవితంలో నేను గమనించాను. నీ అంతరంగ హృదయం ఈ విధంగా చెప్పుతుంది. ''నీ చిత్తముకాదు నా చిత్తము.'' క్రీస్తు చెప్పాడు, ఈ విధంగా చెప్పుతుంది. ''నీ చిత్తము కాదు నా చిత్తమే.'' క్రీస్తు చెప్పాడు. ''నా చిత్తము కాదు నీ చిత్తమే.'' కనుక ఆయన ప్రభువు. నీవు దేవుని వాక్యమునకు విధేయుడవు అయితే లోకము నీకు విధేయరాలగును.

యిర్మియా 12:1-3 ''వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.'' ఈ ప్రవక్తలు ఆయన సత్యములలోనికి లోతుగా వెళ్ళారు. కనుక వారు ఆలాంటి మాటలు చెప్పవచ్చును. మన పొరపాట్ల చూపించవచ్చును. అవును మన పెదవులతో ప్రభువును గూర్చి మంచి విషయాలు మాట్లాడవచ్చును. కానీ మనకు శక్తిలేదు మన మాటలు ప్రజలను దేవుని తట్టు లాగుటలేదు. మనము దేవుని రాజ్యము కట్టవలెనంటే మనకు శక్తి అవసరము. అబ్రహాము దేవుని రాజ్యము కట్టవలసిన ఆగత్యము ఉండింది, కనుక ఆయనకు దేవుని వాగ్గానములు దొరికినవి. అనేకమంది దేవుని వాగ్దానముల మీద నిద్ర పోవుచున్నారు. కాని అబ్రహాము దేవుని రాజ్యము కట్టవలసింది. నీవు మారు మనస్సు పొందినప్పటి నుండి పొందిన దేవుని వాగ్ధానములు ఎన్ని? అవి నీకు జ్ఞాపకమున్నవా, నేను తిరిగి పుట్టినప్పుడు దేవుడు క్రొత్త నిబంధన యొక్క వాగ్దానం దేవుడు ఇచ్చాడు. యెహెజ్కేలు 36:25-27 వరకు, ఈ వాగ్ధానములో ఉండే సంపూర్ణమైనటు వంటి దానిని నేను నా స్వంతము చేసుకున్నానో లేదో ఇలాంటి దేవుని వాగ్దానములు పెట్టుకొని నీవు నిద్రపోవచ్చు, ఈ నిబంధనలోనికి నీవు ప్రవేశించినావు. ఈ నిబంధనలో కొంతమంది జీవించవలెనని కోరతారు. కానీ వారు తిరిగి పుట్టలేదు. ఇది సాధ్యముకాదు. అసాధారణమైన వాటి కొరకు ప్రయత్నించవద్దు. అనేక మంది మారుమనస్సు పొందకుండానే దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి సేవలలో పాలుపొందుట నాకు ఇష్టములేదు. నిజముగా మారుమనస్సు పొందినవ్యక్తి తన స్వార్థమునకు మరణించును. అతను స్వీయానికి మరణించి ఆత్మలో జీవిస్తాడు. నిజమయిన మారుమనస్సు పొందిన వాడు తనకు తాను మరణిస్తాడు. స్వార్ధమనేది తిరిగి, తిరిగి తన తల పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుంది. సహవాస సభ్యులలో కొంతమందిలో స్వార్ధం మళ్ళీ బయటకు వస్తుంది. అలాంటి వారి మీద నేను అధికారం చేయను. నేను వారికి చెప్పి హెచ్చరిస్తుంటాను.

మన పిల్లలకును, ఇతరుల పిల్లలకును ఒక బేధము ఉన్నది. కొంతమంది మారుమనస్సు పొందారు. కానీ ఇతరుల సేవలో మారుమనస్సు పొందారు. వారు వచ్చి మనతో కలునుకోవాలని కోరతారు. వారు వచ్చి మనతో కొంత కాలముంటే వారి విశ్వాసాన్ని పరీక్షిస్తాము. వారి మీద ప్రార్థించమని వారు కోరతారు. వారికి కొంత విశ్వాసము వస్తుంది. ఒక క్రొత్త సహవాసమును ప్రారంభించాలని కోరతారు. నా పిల్లలు వానికి ఎన్ని విజయాలు వచ్చినా నన్ను విడిచిపెట్టరు. నాయందు వారికి నమ్మకము ఉన్నది. వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను.

అబ్రహాముకు కుమారుడు కలుగుతాడని నమ్ముతూ వచ్చాడు. ఆయన వాగ్దానములను స్వతంత్రించుకొని యుంటే దేవుడు అతనిని దిద్దేవాడు. ఒక దినమున దిద్దుబాటుచే హెచ్చరికనిచ్చాడు. నీవు సంపూర్ణుడవుగా ఉండు దేవుని ఎదుట అబ్రహాము సంపూర్ణుడుగా లేడు. ఒక భార్యగా ఐగుప్తు స్త్రీని తీసుకున్నాడు. ఒక ఐగుప్తు స్త్రీని గనుక నీవు తెచ్చుకుంటే ఐగుప్తు నీలోనికి వస్తుంది. ఒక భార్య నీకు ఆశీర్వాదముగా, లేక అడ్డుబండగా వుండొచ్చు.

దేవుడు నాతో దాచబడిన ధనము నిమిత్తము ఆయన వాగ్దానం అడగమని చెప్పాడు. అనగా సేవకొరకు సరి అయినటువంటి ఆర్ధిక సహాయం డబ్బు అంటే నాకు భయము గనుక అదినాకు అక్కరలేదని చెప్పాను. డబ్బు ఎవరినైనా మ్రింగి వేయగలదు. నేను దేవునితో 15 నిముషాలు వాదించి తర్వాత ఒప్పుకున్నాను. ఆ నెలలో దేవుడు ఇస్తాడని అనుకున్నాను. కానీ 25 సం||లు గడిచి పోయాయి. దేవుడు ఇంకనూ నాకు అవి ఇవ్వలేదు. నా ప్రార్థన మెట్టులో అది అపాయకరమని దేవుడు చూపించాడు. ప్రార్థనా హీనతనుబట్టి నీ యింటికి కావలసిన డబ్బు నా యొద్దలేదు. (112, కొడంబాకంహైరోడ్‌లోని స్థలం అమ్మకానికి వచ్చింది. దేవుడు తన వాగ్దానములను నెరవేర్చడానికి బదులు నా ప్రార్థనలు లోతుగా నడిపించాడు త్వరగా డబ్బు వచ్చియుంటే ఆ యింటిని దేవుని కొరకు కలిగియుండుటకు అనర్హుడను. నాలోని గర్వము ఏ క్షణములోనైనా వచ్చును. అది నన్ను ''ఇది చేసింది నేనే'' అని నా చేత అనిపించవచ్చును.

''నీవు నిద్రపోతున్నావు అబ్రహామా! నీకొక కుమారుని ఇస్తానని వాగ్దానం ఇచ్చాను.'' అని దేవుడు చెప్పాడు. '' నీవు నమ్మితే నీకు కుమారుడు కలుగుతాడు. నీ విశ్వాసమును ప్రయోగించు. నిన్ను నీవు శుద్దీకరించుకో. దేవునితో సరి అయిన స్థితిలోనికి రా! మనం దేవుని పరిశుద్దకు తక్కువ పడుతున్నాము. నేను దేవుని పరిశుద్ధతకు చాలా తక్కువ పడినట్లు చూసుకొనుచున్నాను. కనుక నన్ను నేను శుద్దీకరించుకుంటున్నాను. మన బాగు నిమిత్తం దేవుడు తన వాగ్దానములను ఆలస్యం చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్ధానములన్నిటినీ నాకు చెప్పగలవా? ''ప్రభువా నేను నీకు నమ్మకస్థుడనైయుంటాను'' అని నేను ప్రభువునడినప్పుడు, దేవుడు నాకు యోహాను 10:28,29 అనుగ్రహించాడు. దీనునిగా దానిని నేను నమ్మాను. నాకు అనేకమైన ఆకర్షణలు, నన్ను తప్పుదారి నడిపించేవి నా దారిలో వచ్చాయి - భాషలలో మాట్లాడడం - కాని దేవుడు వాటిని జయించడానికి సహాయమిచ్చారు. తల్లిదండ్రులు అయిన మీరు ఏదో ఒక ఆత్మచేత నడిపించబడి యుండవచ్చు, అదే ఆత్మ మిమ్ములను నడిపిస్తాడు కూడా కాని మీరు నిజముగా మారుమనస్సు పొందినప్పుడు ఆ ఆత్మ మీమ్మును వదలి వెళ్ళతాడు. ఆ ఆత్మ నీ మీద దాడి చేయుటకు మళ్ళీ ప్రయత్నం చేయవచ్చు. | తిమోతి 4:1 నిన్ను నీవు పైకి లేపుకొని ఇతరులకు కనిపించేలాగు ఉంటావా? నీకు దేవుని ఆత్మ ఉంటే నీవు కోరవు. నీ ఆత్మీయ జీవితము యొక్క రహస్యమును నీవు దాచుకుంటావు. అసూయ పరులు ఉన్నారు. ప్రజలు మిమ్ములను వ్యతిరేక లింగ వివక్షకు ఆకర్షింప చేస్తారు. ఒక దైవజనుడు ప్రాధాన్యమైన వాడుగా ఉండకూడదు. కొన్ని విజయాలు దొరికేవరకు, దేవుడు నిన్ను ముందుకు తీసుకురాడు. ఆయన నిన్ను దాచిపెట్టి ఉంచితే పర్వాలేదు. నీ భావము ఎప్పుడూ కూడా ''ఎవరూ నన్ను చూడవద్దు. నన్ను నేను శుద్దీకరించుకోనివ్వండి''. కీర్తనలు 71:1, 8,20 ''అనేక బాధలను మమ్ముకలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు''. నీవు దేవుని వాక్యమునకు విధేయుడవై వణకుదువా, ప్రజలు నిన్ను గుర్తించకపోయినను పర్వాలేదు. ఒకానొక దినమున వారు నీ యొద్దకు వస్తారు. మనము క్రీస్తు యొక్క గాయములలో దాగియుందాము. అదే మన స్థలము ధ్యానమందు మనలను మనము పోగొట్టుకొని ఆయన సారూప్యములోని వద్దాం. పరలోకము నిన్ను గుర్తించును.

మూల ప్రసంగాలు