|
కనిపెట్టి ప్రార్థించుము |
కీ.శే. యన్. దానియేలు గారు |
ఆదికాం ''16:13 ''అది- చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచితిని గదా అని అనుకొనెను.''
మనలను చూసే దేవునిని మనము చూడగల్గుట అదొక గొప్ప దీవెన. ఒక ఐగుప్తు స్త్రీకి చాలా చీకటి ఉంటుంది. విగ్రహారాధన గల దేశమునుండి ఆమె వస్తుంది. అబ్రహాము దేవుని చిత్తానికి వెలుపటికి పోయినప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఐగుప్తీయురాలు అబ్రహాము ఇంటివారికి దాసురాలుగా అతుక్కుంది. ఏ స్త్రీని గాని ఇంటిలో ఉండే పని మనిషిగా పెట్టుకోవడం మంచిది కాదు. అనేక మంది స్త్రీలు పాపమును, చీకటిని తెస్తారు. ఒక దాసురాలను నీవు తీసుకున్నాప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ పిల్లలకు చేసే సేవ అది మహాగొప్ప సేవ. నీవు నీ భార్య కలిసి పరలోకము రూపించినటువంటి గృహము వారికొరకు కట్టాలి. ప్రభువు నీ గృహమును కట్టకపోతే కట్టువారి ప్రయాసవ్యర్ధమే. ఒక ఆదర్శమైనటువంటి గృహంబును దేవుడు అబ్రహాము కొరకు నిర్మిస్తున్నాడు. క్రీస్తును పోలినటువంటి కుమారుని దానిలో నుండి తీసుకురావాలని ఆశించాడు.
క్రీస్తుతో పోల్చగలిగిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. ఇస్సాకు అలాంటి వారిలో ఒకడు. ఒక గృహము పరలోకము వలే సృజించబడినప్పుడు నీవు ఇస్సాకు వంటి ఒక కుమారుని అందులో పెంచవచ్చా. క్రీస్తు దేవుని చేత నిర్మించబడిన ఇంటిలో జన్మించాడు. మరియమ్మ పరిశుద్ధురాలయి స్త్రీ. యోసేపు ఒక ప్రవక్త. ఆయన పరిశుద్ధాత్మతో సంబంధము కలిగి ఉన్నాడు. దేవుడు వీరిద్దరినీ నమ్మి క్రీస్తును వారి చేతిలో పెట్టడానికి సిద్ధముగా ఉండినాడు. మనము విద్య సంపాదించుకున్నాము. మన నాగరికత అనేకరీతులుగా కట్టబడింది. ఇస్సాకు వంటి కుమారుని దేవుడు మన చేతులలో పెట్టలేడు. దేవుడు మనకు పిల్లలను ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తాడు. ఎందుకనగా తల్లిదండ్రులు ఆయన చట్టమును ఎరుగరు. వారి స్వంత చట్టాలను బిడ్డల మీద వినియోగిస్తారు. మన గృహముల వైపు దేవుడు చూసినప్పుడు ఆయనకు కలిగే దు:ఖము చాలా ఎక్కువ పిల్లలను ప్రవక్తలుగా చేసే తర్బీదు మన గృహములలో ఇవ్వము. ఒక ప్రవక్త తయ్యారయ్యే తరుణము పోయింది. ఒక దాసురాలితో చీకటి వస్తుంది. దానితో పాటు వ్యాధి కూడా వస్తుంది.
ఆ గృహములోనికి ఒక గొప్ప కుమారుడు ఉద్భవించబోవుతున్నాడని సైతానుకు తెలుసును. కనుక అతడు ఆ గృహమును పాడుచేయడానికి ప్రయత్నించాడు. అబ్రహాముకు తప్పుదారి దొరికి ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ శారా ఫరోయింటిలోనికి తీసుకొని పోబడింది. దేవుడు ఆమెను ఒక గొప్ప జనమునకు తల్లిగా ఉండాలని కోరాడు. ఆమె భక్తి హీనమైన రాజుల గృహములో ఉండింది.
నీవు దేవుని చిత్తమునకు బయటకు వెళ్ళితే, నీవు నీ బిడ్డలను, భార్యను అపాయములో పెడతావు. దేవుడు శారాను కాపాడాడు. తన బిడ్డలను కాపాడడానికి దేవుడు ఆసక్తి కలిగియున్నాడు. ఫరో శారాను ముట్టలేదు. తన భర్తకు అపనమ్మకస్థురాలైన ఒక స్త్రీ ఒక ఘనమైన వ్యక్తిని పెంచలేదు. దేవుడు స్త్రీకి పిల్లలను కనే శక్తిని ఇచ్చాడు. యౌవన స్త్రీలు తమ్మును తాము పవిత్రముగా కాపాడుకొనుటకు జాగ్రత్త తీసుకుంటే దేవుడు వారిని ఆశీర్వాదిస్తాడు. నీ బిడ్డ ద్వారా నీకు సంతోషం దొరుకుంది. నీ శరీరము, మనస్సు, ఆత్మ పరిశుద్ధ పరచబడగలవు. గర్భంలో బిడ్డ పరిశుద్దుడుగా తయారవుతాడు. నీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయము, నీ విద్య అంతటితో మరియమ్మ తన బిడ్డకు ఇవ్వగల్గిన పెంపుదల నీ బిడ్డకు ఇవ్వగలవా?
ఒక స్త్రీ త్వరగా దేవుని ఆత్మను కలుసుకో గలదు. శారా ఎదుగుతూ ఉండింది. అబ్రహాము వాగ్ధానాలు పొందుతూ ఉండినాడు. ఆయన దేవుని చిత్తాన్ని జ్ఞానమందును, ఆత్మీయ గ్రహింపునందును గ్రహించుకోలేదు. ఆ యిద్దరికీ తర్పీదు దొరుకుతూ ఉండింది కానీ వారిద్దరూ అనేక పొరపాట్లు చేసారు. శారా పొరపాట్లు చేసింది. స్త్రీలు పొరపాట్లు చేస్తారు. వారు తమ భర్తలు సరిదిద్దడానికి ఇష్టపడరు. ఎందుకనగా వారు బలహీనతలను ఎరిగినవారు. ఎలాగైననూ సరే ఇద్దరు ఒక చోట పెట్టబడ్డారు. వారు ఒకర్నోకరు దిద్దుకోవాలి. దూతలవంటి పిల్లలను తయారు చేయడం ఒక క్రైస్తవ గృహము యొక్క గురి. మోషే గృహములో ముగ్గురు పిల్లలు దేవుని వలన వినియోగించబడ్డారు. అప్పుడప్పుడు పొరపాట్లు చేసారు. కానీ వేర్వేరు మెట్లలో వారు ప్రవక్తలుగా ఉండి నారు. అది ఒక గొప్ప మహాత్కార్యము.
అబ్రహాముకు తర్ఫీదు ఇవ్వబడుతూ ఉండింది. సైతాను కూడా అతనిని తర్బీదు చేయడానికి ప్రయత్నిస్తాన్నాడు ప్రభువు ఇస్సాకును అబ్రహాము ఇవ్వవలెనని కోరాడు. అబ్రహాముకు ఇవ్వవలెనని కోరాడు. సైతాను అయితే ఇష్మాయేలు ద్వారా ఇస్సాకును ప్రక్కకు తొలగించవలెనని చూసాడు. ఒక ఐగుప్తీయురాలు దేనిని సాధించగలదు? అది తన్నగల్గినటువంటి ఒక గాడిదని, దేవుడు ఆ గాడిదను ప్రక్కకు తొలగించాడు.
ఒకప్పుడు నేను ఒక పేద విధవరాలిని నా బిడ్డలను చూసుకోవడానికి తెచ్చాను. అది దేవుని పరిపూర్ణ చిత్తము కాదు. రోమా 12:2, యూదా 1:20 వచనం. నీవు ఆత్మ యందు ప్రార్థిస్తే నీవు ప్రవచిస్తావు. పౌలు తన జీవితమును విశ్వాసము మీద నిర్మించాడు. ఎఫెసి 6:18,22. అబ్రహాము చీకటి శక్తులకు వ్యతిరేకముగా పోరాడుతున్నాడు.
నీవు ఒక యూదా ఇస్కరియోతును ఉత్పత్తిచేస్తే సైతాను దాన్ని బట్టి బాధపడడు. కాని ఒక యోసేపును, ఒక దానియేలును, ఒక ఇస్సాకును ఉత్పత్తి చేస్తే సైతాను నీకు వ్యతిరేకముగా కదులుతాడు. పవిత్ర పరచబడిన ఒక తల్లి చీకటి శక్తులకు వ్యతిరేకముగా పోరాడాలి. ఆమె ప్రార్థించే వ్యక్తి కాక పోతే తన భర్త ప్రక్కకు పోతాడు. ఆమె తన పిల్లలను, భర్తను కాచుకోవాలి. కొంతమంది స్త్రీలు దేవుని వలన తమకివ్వబడిన ఈ పరిశుద్ధమైన అప్పగింతను నిర్లక్ష్యం చేస్తూ వారు ఉన్నతమైన విద్య ద్వారా వారు ఎక్కువ డిగ్రీలు సంపాదించాలని చూస్తారు. దేవుని భయమునందు నీ బిడ్డలను పెంచు అదొక పెద్ద పని.
శారా నమ్మకస్థురాలైన భార్య. కొంతకాలం ఆమెకు బుద్ధిహీనత కలిగింది. కొందరు స్త్రీలు బుద్ధిహీనులుగా ఉంటారు. దేవుని కృప వారియందు పని చేసి వారిని జ్ఞానులుగా చేస్తుంది. స్త్రీలు గర్భిణీలుగా ఉన్నప్పుడు మేము తల్లులము కాబోవుచున్నామనీ గర్వము వారికుంటుంది. అది కలిగించే గొప్ప పూచిని వారు గ్రహించాలి.
సేవకురాండ్ర విషయమై జాగ్రత్త, వారికి కొంత కనికరము చూపిస్తే వారు తలలు పోగోట్టుకుంటారు. దీనులుగాను, కృతజ్ఞత గలవారుగా ఉండడం కన్నా గర్విష్టులు అయిపోతారు. ఒక దినమున హాగరు ఇల్లు విడిచి వెళ్ళి పోయింది. వారు మంచి క్రైస్తవ జీవితములో ఎదుగ గల్గిన స్థలము నుండి మనుష్యులు ఎంత త్వరగా తప్పిపోతారు! ఎంతబుద్దిహీనురాలు ఆ స్త్రీ! హాగరు ఎన్నడూ దేవుని కలుసుకోలేదు! కాని దేవుడు హాగరును కలుసుకున్నాడు.
ఒకడు గవర్నరును నాతో మాట్లాడేటట్లు చేస్తానని గర్వంగా మాట్లాడినాడు. కొన్ని రాళ్ళు తీసుకొని గవర్నరు మీదికి విసిరాడు. అతన్ని పట్టుకొని గవర్నరు ముందుకు తెచ్చారు. కానీ అతడు విన్నటువంటి మాటలు ఆహ్లాదకరమైన మాటలు కాదు. కొంత మంది ప్రజలు ఆలాగున్నారు. వారు దేవుని కలుసుకోరు. కాని దేవుడు వారి బుద్ధిహీనమైన, అపాయకరమైన క్రియాలనుండి తప్పించడానికి కలుసుకున్నాడు. ఈ లాగున హాగరు ఆ గృహమునందు కొంతకాలము ఉండడానికి ఇష్టపడింది.
శారాకు క్రొత్త పేరు క్రొత్త స్వభావము దొరికినటువంటి సమయము ఒకటి వచ్చింది. శారా ఆత్మీయముగా తగిన స్థితిలో ఉండినప్పుడు ఆమెకు శిశువు కలిగినాడు. ఆమె బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు ఆమె యందు వ్యతిరేకమయిన భావములు ఏమీలేవు. ఆమె శరీరము అంతా పరిశుద్ధాత్మ యొక్క అధికారం క్రిందకు వచ్చింది.
నీ బిడ్డలు విలువైన వారు, వారిని కోరిన చోటకెల్లా పంపవద్దు | యోహాను 2:17, దేవుని వాక్యము నీయందు నిలిచియున్నట్లయితే దేవుని శక్తి నీ యందుండును. గొప్ప నడుపుదలతో, ఏర్పాటుతో దేవుడు నీ కొక గృహమును ఇచ్చాడు. దాన్ని కాపాడు. దేవుడు తానే నీ గృహమునకు వస్తాడు. నీ గృహమును పరిశుద్ధ పరిచి దానిలో నివశించే వారిని తన మహిమార్థమై వాడుకుంటాడు. ఇస్సాకు నిందారహితమైన జీవితం జీవించాడు. ఆయిన ఎదిగిన గృహము అలాంటిది కాబట్టియే.
|
|