లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

మనము అంతము వరకు దీనులమైయుండాలి

కీ.శే. యన్‌. దానియేలు గారు

2దినవృ. 32:24-31 వరకు

''హిజ్కియా ఆయనకు కలిగిన మేలుకు సమముగా తన క్రియలను జరిగించలేదు...'' హిజ్కియా చరిత్ర ఆశ్చర్యం కలిగించేది. సింహాసనమునకు వచ్చినప్పుడు దేశాన్ని ఉజ్జీవింపచేయాలని కోరాడు. యాజకులు తమ్మును తాము పరిశుద్ధ పరచుకోవాలని కోరాడు. యూదా రాజ్యములో 8 మంది మంచిరాజులు ఉండినారు. కానీ ఇశ్రాయేలు రాజ్యములో మట్టుకు మంచి రాజులు లేనే లేరు. ఈ యూదా దేశపు 8మంది రాజులలోనూ 4 చాలా మంచి రాజులు ఉన్నారు. ఈ నలుగురు రాజులు ఒక తీవ్రమైన తప్పు తమ పాలనా కాలములో చేసారు. యెహోషాపాతు చాలా మంచిరాజు. కానీ ఆయన చాలా పెద్ద పొరపాటు. అతని కుమారుని విషయంలో చేసాడు.

హిజ్కియా తన దేశమును ఉజ్జీవింప జేసాడు. మనం దేవునికి సమీపముగా వచ్చేటప్పుడు మన జీవితములోనే ఒక్కొక్క భాగం ఆశీర్వదించబడుతుంది. ఉజ్జీవము వ్యాధి, బాధలను తొలగిస్తాయి. ప్రజలలోనికి పరిశుద్ద జీవితం వస్తుంది జీవితం వస్తుంది. వెస్లీ కాలములో వచ్చిన ఉజ్జీవము వంద సం|| వరకు కొనసాగింది. దానికి ఒక్కతల్లి తీసుకొనిన పూచీ ఆమె ప్రార్థనతో నిండిన క్రైస్తవరాలు. హిజ్కియా తన దేశమునకు చాలా అభివృద్ధి తీసుకువచ్చాడు. అప్పుడు సన్హేరీబు వచ్చి ఆయనకు దాసోహం చేయమన్నాడు. ఆ సమయములో దేశమందు ఆ మోసు ప్రవక్త ఒకడు ఉండినాడు. ఒక నిజమైన ప్రవక్త దేశములో ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఆ ఇబ్బంది కల్గినప్పుడు హిజ్కియా ఆ మోసును పిలిపించాడు. ఆ మోసువచ్చి దేవుని వాక్యమును ప్రకటించాడు. శత్రువు ఒక్క బాణమును కూడా నీ దేశం మీద వేయడు అని చెప్పాడు. అకస్మాత్తుగా శత్రువు నాశనం అయపోయాడు. సన్హేరీబు దేవున్ని దూపించాడు. దేవున్ని తిరస్కరించడం చాలా గొప్ప అపాయము. మరియ ముఖ్యముగా పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ మనుష్యులు చాలా జాగ్రత్త ఉండాలి.

హిజ్కియా ఒక్కసారి జబ్బుపడ్డాడు. నీవు మరణిస్తావు అనే వార్త హిజ్కియా వద్దకు పంపించాడు. ఒక దీనమైన ప్రార్థన హిజ్కియా చేసాడు. దేవుడు ఆ దీనమైన ప్రార్థన అంగీకరించి ఆయుష్షు 15 సం|| పొడిగించాడు. అతడు అధికంగా అభివృద్ధిచెందాడు. తర్వాత అతని హృదయము గర్వముతో పైకిలేచింది. అతడు కృతజ్ఞుడుగా ఉండ లేదు ఆత్మీయ జీవితములో కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమయిన భాగం కృతజ్ఞతకు మరియొక ప్రక్కన విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. మనము దేవుని కృపలను జ్ఞాపకం చేసుకొని, స్తుతించేటప్పుడు మనము విశ్వాసములో ఎదుగుతాము.

హిజ్కియా గర్వించాడు. దేవునికోపం అతని మీద దిగివచ్చింది. దేవుని గొప్ప కార్యములు చూసాడు. దేవుడు ఒక మారు గొప్ప సూచన అగుపరచాడు. సూర్యుడు 12 డిగ్రీలు వెనక్కువెళ్ళుట. తర్వాత బబులోను దేశపురాజు అతని కుమారుని పంపించి ఆయనకు వందనములు చెప్పుటకు జరిగిన గొప్ప కార్యమును బట్టి అతనిని స్తుతించడానికి వచ్చారు. హిజ్కియా ఉబ్బిపోయి వచ్చిన అధ్యక్షునికి తన ఆస్తినంత చూపించాడు. దేవుడు హిజ్కియాతో నిస్సంతోషిగా ఉండినాడు. హిజ్కియా చూపించిన ఆస్థి అంతా ఒకనాటికి ఒబులోనుకు కొనిపోబడుతుందని చెప్పాడు. మనము ప్రజలముందు మన ఆత్మీయ జీవితాన్ని సమయము కాకముందు తెరచి చూపించకూడదు. ఆత్మీయ విలువలు లేని వారికి మన ప్రశస్తమైన క్రైస్తవ అనుభవాలు చెప్పకూడదు. హిజ్కియా యొక్క పాపము శిక్షించబడాలి. ఈ శిక్ష అతని కుమారుని కాలములో వచ్చింది.

మనము జీవితాంతము వరకు దీనులుగా మనలను కాపాడుకోవాలి మనలో ఏమీలేదు. దేవుడు మనలను గొప్పగా వాడుకోవచ్చుగానీ మనమే శ్రేష్టులమని భావించరాదు. మనకన్నా శ్రేష్టులైన క్రైస్తవులు ఉండినాడు. వారిని మనం కలుసుకోలేదు. నీకు కృతజ్ఞత ఉంటే నీవు దీనుడవుగా ఉంటావు. నీ ఆరోగ్య విషయము నీవు కృతజ్ఞుడుగా ఉన్నావా? తృప్తిగా భోజనము చేయడానికి నీకు ఉండే శక్తి నీవు పరిగెత్తడానికి ఉండే శక్తి హాయిగా నిద్రపోవడానికి శక్తి, విటన్నిటి విషయములో నీవు కృతజ్ఞుడవుగా ఉన్నావా? నీ ఆత్మీయ మైత్రి కొరకు, సహవాసము కొరకు నీవు కృతజ్ఞుడువుగా ఉన్నావా? దేవుడు చేసిన మేలులకొరకు మనము చాలా దీనులముగా ఉండాలి. దేవుడు కృతజ్ఞతను కోరుతున్నాడు.

మూల ప్రసంగాలు