|
నీవు నీ స్వంతము కాదు |
కీ.శే. యన్. దానియేలు గారు |
లూకా 9:23-26. ''తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.'' యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఒక గొప్ప సత్యము బయలు పరుస్తున్నాడు. బైబిలు చెప్పే లోకోక్తి లోకము చెప్పేలోకోక్తులకు వ్యతిరేకమయినది. ఎవరైననూ తన్ను తాను హెచ్చుంచుకొన గోరితే అతడు తన్ను తాను తగ్గించుకొనవలెను. ఎవరైననూ కృపతోనూ శక్తితోనూ నింపబడగోరితే అతడు మొట్ట మొదట మరణించవలెను. ఎవడైననూ జ్ఞానియైయుండగోరితే అతడు మొట్ట మొదట బుద్ధిహీనుడుకావలెను.
కొండ మీది ప్రసంగము తిరిగి పుట్టిన వాని యొక్క జీవితములో జరిగే సాధారణ సంభము. క్రీస్తు ఏ రీతిగా అనుభవములో జరుగబోయే విషయములను తెలియపరుస్తాడో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దురదృష్టవశాత్తు దేవునిని తన వాక్కు మీద తీసుకోము. కనుక మనం ఫలము చూడము. మనుష్యులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొనుటలో విశ్వాసములేని వారైతే వారు ఇటువంటి ఫలములు ఎక్కడ చూడగలరు. కానీ మనము నిజముగా ఆత్మవలన జన్మించిన వారమైతే దేవుని సంబదులు అందరూ మనవాళ్ళని తెలుసుకుంటాము. నీయందు దేవుడు ఉంటాడు. నీవు దేవునిలో ఉంటావు. నీ బిడ్డలు అందరూ దేవునికి సంబంధించిన వారు అయితే నీవు ఎంత సంతోషముగా ఉంటావు. ప్రజలు వారి బిడ్డలను దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనుకకు తీస్తారో నాకు అర్థముకాదు. వారి పిల్లలు దేవునికి చెందిన వారని తాము మట్టుకు చెందిన వారు కామని దేవునికంటే వారికి తమమీద హక్కులేదని వారు అంగీకరించరు.
| కొరింధి 6:19 ''మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు.'' మనము మన సొత్తుకాము. మీ శరీరము మీ సొత్తుకాదని మీరెరుగుదురా? అలాగయితే మీరు దేవుని ఆరాధించుటకు వెళ్ళునప్పుడు ఏ రీతిగా నిన్ను నీవు అలంకరించుకోవాలో నీకు తెలుస్తుంది. నీ ముఖము నీ దికాదు. నీ ముఖము దేవుని ఎదుట అంగీకృతముగా ఉన్నదా? నీ హృదయమును నీవు దేవుని వాక్యముతో కడుగుకుంటే నీముఖములోనికి పరలోకపు సౌందర్యము వస్తుంది. నేను ఒక స్త్రీ ముఖము చూసాను. ఆమె ముఖము ప్రకాశిస్తూ ఉండింది. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె హృదయం మార్చబడిందని తెలిసింది. నీవు నీ సొత్తుకాదు. నీవు నీ సొత్తుకాదని తెలుసుకున్నప్పుడు ఆత్మీయ జీవితములో అది గొప్పమెట్టు. ఆ ఎత్తుకు నీవు రాకపోయివుంటే నీవు దు:ఖపడాలి. అనేకమంది తల్లులు తమ బిడ్డల యొక్క రోగములగూర్చి వారి యొక్క బాధలగూర్చి దు:ఖించాలి. దానికి కారణము ఏమనగా వారు తమ సొత్తు కాదు అని తెలుసుకునే స్థలానికి రాలేదు. నీ శరీరాన్ని నీ దుస్తులను నీవు పారవేసే సమయము ఒకటి వస్తుంది.
నీవు నీ సొత్తుకాదు. ఆ యిల్లు నీదేనని అనుకుంటావు. లేదు అది అలాగు కాదు. నీవు దేవుని మహిమార్థముగా వాడుకునే వరకు అది నీది. నీవు ఒక ఇంటిని కట్టించుకున్నావు. చాలా కాలము దానిని ఆక్రమించుకోవు. ఎందుకంటే అది నీ స్వాస్థ్యమనుకుంటావు. పౌలు అనుకున్నాడు సింహాసనము తనదే అని. అతడు దాన్ని పోగొట్టుకున్నాడు.
| దినవృ 17:27 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదింప ననుగ్రహించి యున్నావు. యెహోవా నీవు ఆశీర్వాదించిన యెడల అది ఎన్నటికిని ఆశీర్వాదించబడి యుండును.'' అతడు దేవుడు సొలోమోనును దీవించాలని కోరాడు. అతడు సొలోమోనుతో చెప్పాడు. దేవున్ని పరిపూర్ణ హృదయముతో వెదుకుట కంటే దేనినీ వెదకవద్దనీ, దేని మీదా ఆధారపడవద్దని సొలోమోనుతో దావీదు చెప్పాడు కనుక దావీదు తన సింహాసనాన్ని కాపాడుకున్నాడు.
తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, తన ఆస్తిని పోగొట్టుకొనువాడు. తన గొప్పతనమును పోగొట్టుకొనువాడు వాటిని సంపాదించుకొనును. నీ భార్య నీ స్వంతముకాదు. ఆమె దేవుని వరము. నీవు ఆమెను అలాగే తలంచుచున్నావా? లేక పోయినట్లయితే యోహాను 17:10లో చెప్పబడినట్లు ఆయన మహిమైశ్వర్యములను నీవు పోగొట్టుకొంటున్నావు. ''నావన్నియు నీవ్ష్మి నీవియు నావి ్ష్మ వారియందు నేను మహిమపరచబడియున్నాను.'' యోహాను 17:21 తండ్రీ నాయందు నీవును, నీయందునేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు నేను ప్రార్థించుటలేద్ష్ము వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నను.'' మన సమస్తమును దేవునికి ఇచ్చి వేసినప్పుడు ఎంత మహిమకరముగా ఉంటుంది. నీకు సంబంధించి నీ గృహములో ఉండే వారందరూ నీ గృహములో ఉండే వస్తువులన్నీ దేవునికి చెందినవని తెలుసుకొనుట దేవునియందు నీకు ఎంత గొప్పనమ్మిక కలుగుతుంది? మరణించుచున్న తన కుమారుని కొరకు ప్రార్థించిన ఒక వ్యక్తిని నే నెరుగుదును. దేవుడు తన కుమారుని తిరిగి ఇచ్చివేసాడు. ఆ తండ్రి ఇప్పుడు అతనిని లోకము కొరకు పెంచుతున్నాడు. కృతజ్ఞతలేని వ్యక్తి. అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చాడు. దేవుడు తిరిగి అతన్ని అబ్రహాముకు ఇచ్చివేశాడు. అబ్రహాము దేవుని కొరకు అతనిని పెంచాడు. అప్పుడు ఇస్సాకు లోకమంతటికి ఒక దీవెనగా పెరిగాడు.
|
|