లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీవు అతని కంటి పాపలాంటి వాడవు

కీ.శే. యన్‌. దానియేలు గారు

| కొరింధి 12:4-31 వరకు

తప్పుడు బోధల నుండి మనలను కాపాడుటకు ఇది చక్కగా విశదపరుచుటనటు వంటి అధ్యాయం. | కొరింధి 12:3 ''ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ''మీరాయనను పరిశుద్ధాత్మ వలన తప్ప ప్రభువని పిలువలేరు. నీ హృదయమంతటితో దానిని చెప్పగలిగితే ఆయన ప్రభువుగానూ మీరాయన దాసులుగానూ ఉంటారు. ఆయన నిన్ను పట్టుకుంటాడు - నీ వ్యక్తిత్వమంతటిని. ఆయన ఏ విధముగా పట్టుకుంటాడు అంటే నీసేవ ఉన్నతమైన మెట్టులో ఉంటుంది. మీ సేవ చాలా దూరం ఫలించేదిగా ఉంటుంది. ఒక ఉపాధ్యాయురాలు పశ్చత్తాపపడిన తర్వాత దేవున్ని వెదుకుతూ ఉండింది. అది ఉజ్జీవకూటముల పరంపర తర్వాత జరిగింది. మధ్యరాత్రి వేళలో అకస్మాత్తుగా ప్రభువు నామమున తన హృదయమంతటితో ప్రార్థన చేస్తూ ఉండడం గమనించింది అది ఆమెకు గొప్ప ఆనందం దయ చేసింది. నీ పెదవులతో నీవు ప్రభువు అని చెప్పవచ్చు. అది నీకు ఎలాంటి ఆనందం ఇవ్వదు. ఆయన నిజముగా నీ ప్రభువు అయి ఉంటే నీ జీవితం మానవాతీతముగా ఉంటుంది. నూతన ప్రేమగల ఆత్మ నిన్ను నింపుతుంది. ఇది నిన్ను నీరక్షణ కొరకు నిన్ను నీవు వ్యయపరచుకొనేటట్లు చేస్తుంది.

నీవు నీ డబ్బును, నీ విద్యను, నీ బంధువులను నీ సొంతములాగా కరచుకోకపోతే నూతన కృప నీలోనికి వస్తుంది. దేవుడు తన కృపలను నీకు అప్ప జెప్పుతాడు. ఆయన కృపలన్నిటికీ నీవు అర్హుడవేకానీ వాటినన్నిటినీ పొందడం చాలా అపాయకరము. ఆయన ఏర్పరచబడిన దాసుడవని నిన్ను చూపరచడానికి ఆయన ఏదో ఒక ఈవి నీకు ఇస్తాడు. ప్రభువునే మంచి ఈవి ఏదో ఏర్పాటు చేసుకోనీ. ఏదో ఒక ప్రత్యేకమైన ఈవి కొరకు అడగడం అపాయకరం. యేసే అన్నింటిలోనికి గొప్ప ఈవి. ఆయననే నీవు వాంచించాలి. దేవుడు నీకు ఒక ఈవి అను గ్రహించినప్పుడు ఆయన నిన్ను దాని ద్వారా పాడైపోకుండా ఉండేటట్టు నిన్ను చూసుకోగలిగేటట్లు ఉంటుంది. యెషయా 42:8 ''యెహోవాను నేనే. ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.'' యెషయా 48:11 '' నా నిమిత్తము , నా నిమిత్తమే అలాగు చేసెదను. నా నామము అపవిత్ర పరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.'' దేవుని మహిమను మనము తీసుకోవడం చాలా అపాయకరం. మనము ఆయన మహిమను తీసుకుంటే ఆయన అసూయపడే వాడు కాదు కానీ అది మనకు అపాయకరము. అన్నామణి ఒకప్పుడు జబ్బుగా ఉండింది. దేవుడు ఒక కోడిని వినియోగించుకొని ఆమెకు గుడ్లు ఇచ్చాడు. అన్నామణి ఆ కోడిని ఘనపరచవలెనని కోరింది. అప్పుడు దేవుడు ఈలాగుచెప్పాడు, ''ఆ కోడిని సృజించినవాడను నేను. నా మహిమను వేరొకనికి నేనివ్వను.'' ఒక బిడ్డ నీయింట్లో వ్యాధిగ్రస్తురాలైయుంటే దేవుడు నిన్ను ఆమెను స్వస్థపరచడానికి వాడు కొవచ్చు. స్వస్థపరిచేది నీలో ఉన్న ప్రత్యేకమైన ఈవి కాకపోవచ్చు. ఈవులన్నీ పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఉంటాయి. ఫిలిప్పు ఇతి యోపియాలో ఉండిన ఆ పెద్ద అధికారితో మాట్లాడడానికి ధైర్యము కలిగినవాడు. ఆయన పరుగెత్తి రధముకన్నా ముందు వెళ్ళగలిగినాడు. పరి-పౌలులో ఉండిన మిక్కిలి వివేకముగల మేధావితనం దేవుని వలన అతనికి ఇవ్వబడింది. అత్యధికమైన ఆత్మీయబలం అవసరమైన ఎడారి ప్రాంతంలో నీవు పడేయ బడి యుంటే ఆ బలమును నీకు అక్కడ దేవుడు ఇస్తాడు.

పూర్తిగా లోబడిన జీవితము పూర్తిగా నడిపించబడే జీవితము. నీ జీవితము అత్యున్నతమైన విలువను దేవునికి ఇవ్వగలదు. మన మధ్య ఏ విధమైన పోటీగానీ ఉండరాదు. ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరము ఆయన గానీ, ఆమె గానీ చేయవలసిన పని ఉంటుంది. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వలే ఉంటారు. ప్రతి వారు తమ సొంత భాగములో శ్రేష్టులై యుందురు. ప్రతి నక్షత్రమునకు దాని సొంత మహిమ ఉంటుంది. దేవుడు మనలను కూడా గౌరవిస్తాడు. కానీ మనము గౌరవము కొరకు మట్టుకు పనిచేయకూడదు. ఆయన చిత్తములో ఉండడానికి మనము ఎల్లప్పుడూ వెదకాలి. ఈ పనివదిలి పెట్టి ఇంకొక పని తీసుకో అంటే దానికి మనం సిద్ధముగా ఉండాలి. మీరందరూ నా కొరకు ప్రార్థించాలి. సేవను నిర్లక్ష్యము చేయడములో మనము శాపగ్రస్థులము కాకుండా ఉండవలెనని నేను ఎల్లపుడూ ప్రార్థిస్తున్నాను. సహవాసములో నీకు బాధ్యత కలిగిన ప్రత్యేకాధికారము దేవుడు నీకిచ్చినాడు. తదుపరి ఎక్కడ దేవుడు నిన్ను వాడుకుంటాడో నీవు ఎరుగవు. ఆయన యందు నీకు ఒక ఘనమైన స్థానము ఉంది. నీవు క్రీస్తు యొక్క శరీరము అయి ఉన్నావు. మనలో ప్రతి ఒక్కరము ఏవిధముగా పని చేయవలెనంటే మన వైపుకు చూసే ప్రజలు మనందరిలో క్రీస్తును చూడగలిగి ఉండాలి. ఆయన పనిలో పూచీ వహించినప్పుడు నీ పనులలో పూర్తిగా ఆయన కలిసి ఉంటాడని చూస్తావు. ఆయన పనిలో నీవు ఎంత ఎక్కువగా ఆశగొని ఉంటావో నీవు ప్రేమించే నీ బంధుజనులలో నీ జీవితము వారిని క్రీస్తు కొరకు సంపాదించుటలో సహాయము చేస్తుంది. నాశనము అవుతున్న బందువులను గూర్చి నీవు దు:ఖించనప్పుడు దేవుడు దానిని గమనిస్తూ ఉంటాడు. ప్రభువును, నీ హృదయమంతటితో ఆయన సేవచేయి, యెహోషువా నుగొన్న సంతోషములోని రహాస్యం ఇదే. ''నా మట్టుకు నేనునూ నాయింటివారును ప్రభువును సేవిస్తాము.'' దేవుడు నీయందు సమస్త విషయములలోని ఆశక్తి కలిగియున్నాడు. జకర్యా 2:8. ''యెహోవా సెలవిచ్చినదేమనగా'' మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినవాడు'' అయన ప్రేమను, ఆయన అక్కరను తెలిపేటటువంటి బలమైన, మనస్సుకు హత్తుకొనే వాక్యము ఇది.

మూల ప్రసంగాలు