|
దేవుని చిత్త ప్రకారము నడిచే యౌవనస్థులు చారిత్రీకులౌతారు |
కీ.శే. యన్. దానియేలు గారు |
లూకా 1:40-80
మరియమ్మ తను ఎంత అదృష్టవంతురాలో గ్రహించుకొనింది. ఎలీసబెత్తు గృహములోనికి ఆమె ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మచేత నింపబడింది. ఆత్మయందు జీవించేవారు ఆత్మీయ విషయములకు మనం ఎరుగని రీతిగా ప్రతిస్పందిస్తారు. మరియమ్మ తాను ఎరిగిన సత్యమును వెంబడిస్తుండిన స్త్రీ. ఆమె ఈ లోకములో గొప్ప దౌతుందని ఎన్నడూ ఎదురుచూడలేదు. మరియమ్మ ప్రభువు మార్గములో ఎదిగినది. ప్రభువు దానిని గుర్తించాడు. దేవుడు తన వాక్యమునకు విధేయులయ్యే వారి కొరకు చూస్తున్నాడు. ఎందుకనగా దేవుడే వారిని ఉపయోగించుకోగలడు. చివరగా దేవుని వాక్యమునకు విధేయులు అవ్వాల్సిన విషయము వచ్చినప్పుడు మరియమ్మ ఆయన వాక్యమునకు విధేయురాలై దేవుని తృప్తిపరిచింది. ఈ లోకములో ప్రఖ్యాతిగాంచినవారిగా మనం మారడానికి మనం ఎన్నడూ ఆయన వాక్యమునకు విధేయులం కాము. మనం దేవుని వాక్యమునకు విధేయులం కావాలి. ఎందుకనగా దానియందు ఆశీర్వాదం ఉంది.
క్రిస్మస్ యౌవనస్థుల యొక్క చరిత్ర. వారు దేవుని చిత్తమందు జీవించి నడిచినవారు. దేవుని చిత్తప్రకారం నడిచే యౌవనస్థులు చరిత్రాత్మకులు అవుతారు. ఎలీసబెత్, జకర్యా వృద్ధులు. సమస్తమైన దేవుని ఆజ్ఞలలో నిందారహితులుగా నడిచినవారు. వారి వృద్ధ్యాప్యమందు పరిపూర్ణులుగా నడిచారు. మరియమ్మ ఎలీసబెత్తులు బంధు జనులు, విశ్వాసములో ఉన్నతమెట్టు ఈ బంధువులలో కనబడుతుంది. ఎలీసబెత్తు, జకర్యా వారి వృధ్ధాప్యములో సంపాదించిన పరిపూర్ణత మరియమ్మ, యోసేపులు వారి యౌవన దినములలోనే సంపాదించారు. దేవుడు యౌవనస్థుల కొరకు చూస్తున్నారు. వారు ఆయనకు ఎంత ఖర్చయినా విధేయులవుతారు. అలాంటివారిమీదనే దేవుడు ఆధారపడగలడు.
హిజ్కియా వెనక్కు తగ్గినప్పుడు మనష్షే పుట్టాడు. మనష్షే దేశమును ఎంతగా నాశనము చేసాడు? అనగా ఎవరునూ దాని మొదటి మెట్టుకు ఎత్త లేక పోయారు. కానీ పైన చెప్పబడిన కుటుంబములు ఉన్నతమైన విశ్వాసపు మెట్టుకు ఎదిగినారు. యోసేపు యొక్క కలలు, ఎలీసబెత్తు యొక్క మాటలు ఎంత ప్రవచనాత్మకమైనవి! క్రైస్తవచరిత్రలో విశ్వాసము ఉన్నత మెట్టుకు ఎదిగినప్పుడే గొప్ప కార్యములు జరిగినవి. జాన్ వెస్లీ యొక్క తల్లిదండ్రులకు లోతైన విశ్వాసము ఉంది. యౌవనస్థులలో విశ్వాసము ఎల్లప్పుడూ ప్రతి ఫలిస్తుంది. లూకా 1:75 ''మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని, పరిశుద్దముగానూ నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.'' ఈ విధముగా ప్రార్థనకు కలుసుకోవడం ద్వారా మనం ఒకరి కొరకు విశ్వాసంలో ఎదుగుటకు సహాయంచేస్తుంది. ఎలాంటి కుటుంబములు ఇవి? ఎలాటి విశ్వాసమిది? ఏలియా ఎలీషా కాలములో మట్టుకే మనము ప్రవక్తల గుంపు గూర్చి ప్రవక్తల కుమారులని పిలవబడడము చూస్తాము.
పాపము, దానివలన కలుగు మరణము మొట్ట మొదట స్త్రీ ద్వారా వచ్చింది. మరియొక స్త్రీ ద్వారా దేవుని కుమారుడు జీవమును, సమాధానమును తెస్తూవచ్చాడు. యేసు మరియమ్మ యొక్క జాగ్రత్తలో పెరిగాడు. ఆమె అయనకు దేవుని వాక్యము నేర్పించింది. ఎలీసబెత్తు కూడా తన కుమారునికి దేవుని వాక్యము నేర్పించింది. ఆమె ఆ వాక్యమునకు పరిపూర్ణముగా విధయురాలు అయింది. యోసేపు జకర్యా ఈ స్త్రీల విశ్వాసమును బలపరిచారు. ఈ గృహములలో గొప్ప పొందిక ఉండింది. ఈ కుటుంబముల గూర్చి మనము చదివినప్పుడు నూతనమైన, నూతన ప్రాంతములోనికి ఎదుగుతాము. ఎలీసబెత్తు గృహములో మరియమ్మ మూడు నెలలు ఉండినది. అక్కడ ఆత్మీయ వాతావరణము సరి అయిన స్థితిలోనే ఉంటే తప్ప పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక స్త్రీ అక్కడ ఉండలేదు. ఇలాంటిది ఎలీసబెత్ గృహము. మరియమ్మ ఎలీసబెత్తు వారి పూచీని తమ కుమారుల ద్వారి నెరవేచ్చారు. సత్యమునకు నీతికి యోహాను ఒక హతసాక్షిగా మారినాడు. ఆయన అరణ్యములో ఎదిగాడు. యోహాను యొక్క తల్లిదండ్రులు అతని మరణము చూసేవరకు నిలిచియుండలేదు. మరియమ్మ తన కుమారుని యొక్క మరణమును పునరుథ్దానమును చూసింది. పరిశుద్ధాత్మను నూతనముగా పొందినటువంటి వారిలో ఆమె ఒకరె. వారు లోకమును వణికించారు.
సంవత్సరము వెంబడి సంవత్సరము క్రిస్మస్ మనకు వస్తుంది. దేవుని నమ్మకత్వము, దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైన స్థితి ఆయన ఉన్నతమైన ఏర్పాట్లను బలహీనులమైన మన ద్వారా నెరవేరుస్తున్నాడనే విషయాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. బలహీనులమైన మనముకూడా ఆయన మహిమార్థం జీవించగలము అనేది దేవుడు మనం తెలుసుకోవడానికి సహాయము చేయును గాక.
|
|