LAYMEN'S EVANGELICAL FELLOWSHIP INTERNATIONAL
సేవారంభము

సేవారంభము

నా తండ్రి గారు లెక్కల ఉపాధ్యాయులుగా ఆర్ధికముగా స్థిరముగా ఉన్నప్పుడు, తన జీవితము అనేకులను తాకి, దీవెనకరముగా ఉన్న సమయములో 1935వ సం||లో దేవుడు ఆయనను తన పూర్తి సేవలోనికి పిలిచిరి. ఆయన సేవాజీవితములోనికి ప్రవేశించినప్పుడు తన వ్యక్తిగత, సేవా అవసరతలన్నిటి నిమిత్తము దేవునినే నమ్మినందున ''యెహోవాయీరే''-''యెహోవా చూచుకొనును'' అనే తరగని బ్యాంకు హామి నాకు దొరికింది. కావున సేవారంభము నుండి ద్రవ్యము కొరకైన మనవులు లేవు. ప్రార్థనకు జవాబుగా ప్రభువు పంపే, కోరని విరాళాలతో సేవ కొనసాగుచున్నది.

నా తల్లిదండ్రులు దైవవాక్యమును బోధించుటకు ఆహ్వానింపబడిన కొన్ని దక్షిణ బారతదేశపు జిల్లాలలో ఉజ్జీవము ఆరంభమయినది. కలతలతో నిండిన సముదాయాలు, ద్వేషము అసూయతో కూడిన సంఘములు కదిలించే దేవుని బలమైన హస్తముచేత తాకబడుట వలన వేలకొలది మార్చబడిరి. పోట్లాటలు, కోర్టుకేసులకు బదులుగా సమాధానము, ప్రేమ చోటు చేసుకున్నవి. దేవుని బలమైన పశ్చాత్తాపాత్మ మనుష్యుల మీదికి వచ్చినందున విస్తారముగా తిరిగి ఇచ్చివేయుట జరిగినది. సంవత్సరముల క్రితము మోసగింపబడిన వారికి వస్తువులు, చిన్న మొత్తములే కాక పెద్దమొత్తములు సహితము తిరిగి ఇచ్చివేసిరి. ప్రభుత్వమునకు కూడా పెద్ద మొత్తములో డబ్బు చేరినది.

దేవుని శక్తి యొక్క ప్రత్యక్షత ఇప్పటికిని కొన్ని స్థలములలో కొనసాగుచే వ్యాప్తి చెందుచున్నది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడయితే ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారో, '' తమ్మును తాము తగ్గించుకొనుట'' అను దేవుని షరతుకు ఇష్టపడుచున్నారో అట్టి అనే మతాల వారిని, బిన్న ప్రవుత్తులు గలవారిని దేవుడు దర్శించి మార్చుచున్నాడు. ఈ దినాలలో మనుష్యులు భక్తిని 'గ్రుడ్డిగా వెంబడించుటని' పిలుస్తున్నారు. దానికి బదులుగా ప్రజలు ప్రభువైన యేసుకు కలుసుకుంటున్నారు. దేవుడు స్త్రీ పురుషులతో మాట్లాడుచున్నారు.

యేసుక్రీస్తు ''నిన్న, నేడు ఒకే రీతిగి ఉన్నాడు'', దానిని కనుగొనుటకు ఇష్టపడువారికి ''ఆయన దానియేలు''లోని సారాంశములు చదవమని కోరుచున్నాము. (వివరములకు దయచేసి ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ ''బ్యూటిఫుల్‌ బుక్స్‌'' ను దర్శించండి)

- జాషువా దానియేలు