LAYMEN'S EVANGELICAL FELLOWSHIP INTERNATIONAL
విశ్వాసకధనము

విశ్వాసకధనము

1. పవిత్రాత్మగలవాడు, ప్రేమ గలవాడు, అతిగర్వితుడు, మార్పు చెందనివాడు, నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వాంతరవ్యాప్తి, పరిశుద్ధుడు, సర్వశక్తుడు, అగోచరుడు అను ఒకే నిజమైన, సజీవుడైన దేవునిని మనము నమ్ముచున్నాము. ఆయన తన మార్గములన్నిటిలో సార్వభౌముడు, కృపగలవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దీర్ఘశాంతుడు, కనికరముగలవాడు, ఆయనను క్రీస్తు ద్వారా మాత్రమే సంధింపగలము. మనము మొదట దేవుని చేత సృష్టింపబడినను పాపమైన వానిని, తప్పిపోవుట యందు నమ్మికగలవారము. సృష్టికర్తయైన దేవుడు తన అనంతమైన జ్ఞానముతో, తన యొక్క మిక్కిలి వివేకము మరియే మందు జాగ్రత్తతో సమస్త ప్రాణులను ఏలుచున్నాడు. ఆయనలోని ముఖ్యాంశము ప్రేమ. దేవుడు ప్రేమయై యున్నాడు. కావున ఆయన ఆలోచనలు, కార్యములు ప్రేమ నుండే ఆవిర్భవిస్తాయి. దేవునిలో ఐక్యపరచబడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రిత్వము దైవత్వము యొక్క సారమై యున్నది. ఈ త్రిత్వములోని ప్రతి ఒక్కరు విభజింపరాని దైవత్వము యొక సారమును దేవునికి చెందిన పరిపూర్ణతను కలిగియుందురు.

2. దైవావేశమువలన యివ్వబడిన లేఖనములకు దేవుడే మూలము. బైబిల్‌ అద్వితీయమైనది, ప్రధానమైనది. బైబిల్‌ ఆథిపత్యము పూర్తిగా దేవుని మీద ఆధారపడియున్నది. బైబిల్‌ తగినది, నిర్థిష్టమైనది, విశ్వాసము, విధేయత, రక్షించు జ్ఞానము, పొరబాటు పడని నియమముగలది బైబిల్‌ మాత్రమే.

3. యేసుక్రీస్తు యొక్క దైవత్వము, అధికారము - కన్యక జన్మనిచ్చుట, మరణ పునరుత్థానము, ఆరోహణ.

4. మానవుని యొక్క పాపము ఒప్పింపచేసి, పవిత్రము చేసి, పరిశుద్ధపరచునది. దైవ కర్తయైన పరిశుద్ధాత్మయే. పశ్చాత్తాపమనునది చేసిన తప్పు సరిచేసికొనుట, తిరిగి ఇచ్చివేయుటను జరిగించును. ఇది ''విశ్వాసమువలన రక్షింపబడుదుము'' అను ప్రధానమైన సత్యమును తక్కువ చేయదు.

5. మన రక్షణకు సిలువ మీద క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థమైన మరణమే పునాది.

6. విశ్వాసి బాప్తిస్మము పొందుట, ప్రభు రాత్రి భోజనము ఆచరించుట అనునవి క్రీస్తు యొక్క అధికారము చేత నియమింపబడినందునను, అపోస్తలులచేత స్థిరపరచబడినందునను వాటిని రెండు విధులుగా పరిగణించుచున్నాము.

7. యేసుక్రీస్తు రాకడ, పునరుత్థానము మరియు యేసుక్రీస్తుచేత మానవాళి యొక్క అంత్యతీర్పు.

8. దేవుని నుండి నిత్యమైన యెడబాటే పశ్చాత్తాప పడని వారికి కలిగే నిత్యమైన శిక్ష, మరియు విమోచింపబడిన వారికి ఆయన సంఘము నిత్యమైన క్రీస్తు యొక్క సన్నిధే ఆశీర్వాదము.